దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత సంబరంగా జరిగాయి...
- October 30, 2016
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రఖ్యాత మందిరాలు సహా మెట్రో నగరాల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. అటు బాణాసంచా పేల్చి చిన్నా పెద్దా అంతా సంబరాలు చేసుకున్నారు. దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత సంబరంగా జరిగాయి. సందేష్ టు సోల్జర్స్ పేరుతో ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు సైతం ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. పలువురు ప్రముఖులు సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని వారిలో జోష్ నింపారు. ఆర్ ఎస్ పురా సెక్టార్లో పర్యటించిన జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అటు పంజాబ్ లూథియానాలో ఐటీబీపీ భద్రతా దళాలతో కలిసి స్థానికులు వెలుగుల పండగ ఆనందాన్ని పంచుకున్నారు. సరదాగా ఆడి పాడి దీపావళి పండగ జోష్‌ను ఎంజాయ్ చేశారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం దగ్గర దీపావళి పండగ అత్యంత ఘనంగా జరుపుకొన్నారు. రంగురంగుల బాణాసంచా వెలుగుల్లో స్వర్ణ దేవాలయం వెలిగిపోయింది. అటు గాంధీనగర్ అక్షరధామ్ టెంపుల్లోనూ వెలుగుల పండగ వైభవోపేతంగా జరిగింది. వారణాసి గంగా ఘాట్‌లో దీపావళిని పురస్కరించుకుని, ప్రత్యేక హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది తిలకించారు. పింక్ సిటీ జైపూర్‌లో దీపావళి పండగ సందర్భంగా ప్రధాన కూడళ్లన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోయాయి. ఎక్కడ చూసినా టపాసులతో జనం పండగను ఘనంగా జరుపుకొన్నారు. ముంబై, పుణె సహా పలు ప్రధాన నగరాల్లో దీపావళి జోష్ ఓ రేంజ్లో కనిపించింది. చిన్నా పెద్దా అంతా టపాసులు కాల్చి పండగను ఎంజాయ్ చేశారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







