ఖతార్ లో 55 కొత్త పబ్లిక్ పార్కులు!
- August 24, 2015
ఖతార్ పురపాలక మరియు పట్టణ ప్రణాళికా శాఖ వారియొక్క పబ్లిక్ గార్డెన్స్ డిపర్టుమెంట్ వారు ప్రజల అవసరాల మేరకు దేశవ్యాప్తంగా 55 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్టు ఆ శాఖ డైరక్టర్ మొహమ్మద్ అలీ అల్-ఖూరి ప్రకటించారు. ఈ శాఖ వారు ప్రస్తుతమున్న పార్కులను నిరంతరం అందంగా మలచతున్నారని, అనేక సేవలను కూడా కల్పిస్తున్నారని అన్నారు. గత సంవత్సరంలో 15 కొత్త పబ్లిక్ పార్కులను ప్రారంభించామని, మరో రెండు పార్కులను కొద్ది నెలలలో ఉమ్మ్ సలాల్ మరియు అల్ వక్రా లో ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కులలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఇక్త్ కతార్ వారితో కలసి కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమ శాఖ మరియు పబ్లిక్ వర్క్స్ ఆధారిటీ, ఇంకా ఇతర శాఖల మధ్య సహకారాన్ని ఆయన కొనియాడారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







