మరోసారి మరియానా రజోరు పదవీ బాద్యతలుస్వీకరించారు...
- October 31, 2016
స్పెయిన్ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత మరియానా రజోరు సోమవారం నాడు మరోసారి పదవీ బాద్యతలుస్వీకరించారు. దాదాపు పది నెలల పాటు కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ సోమవారం ఉదయం రాజు నాల్గవ ఫిలిప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. స్పానిష్ రాజ్యాంగప్రతిపై చేయి వుంచి రజోరు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జాతీయ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రజోరుకి రాజు ఫిలిప్ అభినందనలు తెలియచేశారు. మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనకు రాజు ఫిలిప్ మూడు రోజుల గడువిచ్చారు.ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పది నెలల ప్రతిష్టంభన కొనసాగిన తరువాత ఏర్పడిన ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రివర్గ నిర్మాణం రజోరుకి చిక్కుముడే అవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







