బ్యాంకులకు సీవీసీ స్పష్టీకరణ
- October 31, 2016
విజయ్ మాల్యా తరహాలో భారీ రుణ ఎగవేత ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కొన్ని చర్యలు చేపట్టింది. రూ.కోటికి మించిన ఎగవేత అంశాలను తప్పనిసరిగా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పష్టంచేసింది. వీటిని పరిశీలించి.. సీబీఐ విచారణకు ఆదేశించాలా వద్దా అన్నదానిపై సిఫార్సులు చేస్తుంది. ఈ అంశంలో సహకరించడానికి సీవీసీ ఇప్పటికే నలుగురు జనరల్ మేనేజర్ స్థాయి బ్యాంకు అధికారులను సలహాదారులుగా నియమించుకుంది. 2015లో బ్యాంకు మోసాలకు సంబంధించి రూ.20,646 కోట్లతో ముడిపడిన 171 కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది.రూ.50 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి నెలనెలా రిజర్వు బ్యాంకు, సీబీఐ, బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించాలని కూడా సీవీసీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







