తప్పిపోయిన హోటల్ ఉద్యోగి దారుణ హత్య
- November 01, 2016
మస్కట్: ఫిలిప్పీన్‌కి చెందిన ఓ హోటల్ ఉద్యోగి, శవమై తేలింది. షట్టి అల్ కర్రమ్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రాయల్ ఒమన్ పోలీసు అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. మస్కట్‌లోని ఓ హోటల్‌లో ఆమె పనిచేస్తోంది. సహచరులతో కలిసి బయటకు నడుచుకుంటూ వెళ్ళిన సమయంలో ఆమె ఆచూకీ గల్లంతయినట్లు తెలియవస్తోంది. దాంతో ఈ కేసులో ఆమెతోపాటు బయటకు వెళ్ళిన వ్యక్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దోపిడీకి గురయ్యిందనీ, అనంతరం ఆమెను హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె పనిచేస్తున్న హోటల్ యాజమాన్యం ఇంతవరకు ఎలాంటి స్పందనా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







