మహిళ అక్రమ రవాణా భగ్నం
- November 01, 2016
మనామా: సౌదీ భద్రతా సిబ్బంది తనిఖీల్లో, మహిళ అక్రమ రవాణా కేసు వెలుగు చూసింది. బహ్రెయిన్ నుంచి ఓ మహిళను దేశంలోకి తీసుకొస్తున్న సమయంలో కింగ్ ఫహాద్ కాజ్‌వే వద్ద చెకింగ్ సందర్భంగా ఆమెను కస్టమ్స్ సిబ్బంది గుర్తించి, ఆమెను అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. తాను ప్రయాణిస్తున్న వాహనంలో సీట్ల వెనుకాల ఆ మహిళను ఉంచి ఓ వ్యక్తి బహ్రెయిన్ నుంచి సౌదీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన కస్టమ్స్, అలాగే భద్రతా సిబ్బంది ఇరువురినీ అదుపులోకి తీసుకుని, విచారించారు. ఈ సందర్భంగా ఆ మహిళ వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించారు. అదుపులోకి తీసుకున్నవారిపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







