ఈ నెంబర్ లో 0888 888 888 మిస్టరీ దాగుంది...
- November 01, 2016
ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్.. ఫ్యాన్సీ ఫోన్ నెంబర్ల మీద మోజు ఆ నంబర్ల కోసం ఎంత ఖర్చు చెయ్యడానికైనా కొంత మంది వెనుకాడరు.. అలా ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఫ్యాన్సీ నెంబర్ వారిని చంపేస్తుంటే.. .. ఈ మాటని నమ్మలేకున్నా నిజం.. ఆ నంబర్ వాడిన వారందరూ మరణిస్తున్నారు.. ప్రస్తుతం ఆ నెంబర్ ఇదే నంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ప్రాణాలను తీస్తున్న ఆ ఫ్యాన్సీ నెంబర్ ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉందా..! వివరాల్లోకి వెళ్తే...
0888 888 888 చాలా మంది మరణానికి కారణమైన నెంబర్ ఇదేనంటూ ప్రస్తుతం ఓ వార్త షికారు చేస్తోంది.. చూడడానికి ఎంతో బాగున్న ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ను వాడిన వారంతా మరణిస్తున్నారు అని ఓ ప్రచారం జరుగుతోంది. ఈ నెంబర్ ను తొలిసారిగా వాడిన మొబిటెల్ కంపెనీ సీఈవో క్యాన్సర్ తో మరణించారు.. ఇతని మరణానికి కారణం బిజినెస్ లో నెలకొన్న వివాదాలే అని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అనంతరం ఈ నెంబర్ ను కన్ స్టాన్ టిన్ డిమిట్రొవ్ అనే డ్రగ్ మాఫియా డాన్ ప్రత్యర్ధుల చేతిలో నెదర్లాండ్స్ లో దారుణ హత్యకు గురయ్యాడు.. అతను హతకు గురయ్యే సమయంలో ఫోన్ అతని వద్దనే ఉన్నదంటారు...
ఇదే నెంబర్ ను వాడిన మూడో వ్యక్తి డిష్ లీవ్ అనే వ్యాపార వేత్త.. ఇతను 2005 లో బల్గేరియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ ఎదురుగా హత్యగావించబడ్డాడు. అప్పటినుంచీ ఈ నెంబర్ ను ఎవరూ వాడుతున్నట్లు లేదట.. ఎవరు ఫోన్ చేసినా ఔట్ సైడ్ నెట్ వర్క్ కవరేజ్ అనే సమాధానం వస్తుంది. కాగా వీరి చావులకు 0888 888 888 కు సంబంధం ఉన్నా.. లేక పోయినా అందరూ నమ్ముతున్నారు. ఈ నెంబర్ లో మిస్టరీ దాగుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







