సౌదీ అరేబియాలో హైదరాబాద్ తల్లీకూతుళ్ల అవస్థలు!
- November 01, 2016
ఉపాధి కోసం సౌదీచేరిన తల్లీకూతుళ్లు నరకాన్ని చవిచూస్తున్నారు. ఏజెంట్ల మాయలోపడి పొ రుగుదేశం చేరినందుకు తగినశిక్ష అనుభవిస్తు న్నామంటూ నగరంలోని బంధువులకు సెల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఆ మొబైల్‌ఫోన్ స్విచాఫ్ కావటంతో బాధితుల తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించా రు. అక్కడా చీత్కారమే ఎదురవటంతో ఎంబీ టీ నాయకుల వద్దకు చేరారు.
ఆయన సౌదీ అరేబియాలోని భారతీయ అంబాసిడర్‌ను తల్లీ బిడ్డలను కాపాడాలంటూ లేఖ రాశారు. ఏంబీ టీపార్టీ స్పోక్స్‌పర్సన్ అమ్జాద్ ఉల్లాఖాన్ సోమ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివ రాలు వెల్లడించారు. దానిప్రకారం బాధితుల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా నవాబ్సాహేబ్కుంట ప్రాంతానికి చెం దిన మసరతబేగం(50), అయేషా సిద్దిఖ(24) తల్లీకూతుళ్లు.
ఉపాధి కోసం సౌదీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అదే ప్రాంతా నికి చెందిన ఓ ఏజెంట్ తల్లీకూతుళ్లకు వీసా తోపాటు రియాద్‌లో ఇద్దరికీ ఒకేచోట మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ముం బైకి చెందిన ఇద్దరు ఏజెంట్ల సాయంతో తల్లీ కూతుళ్లు ఇద్దరినీ రియాద్ పంపారు. అక్క డకు చేరిన మొదటిరోజు నుంచే వేదన మొదలైంది.
వారిద్దరీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం కల్పించారు. తక్కువ జీతంతో అధికపని చేయించ టం ప్రారంభించారు. ఈ బాధపడలేక పాస్ పోర్టులు ఇమ్మని అడిగితే గదిలో బంధించారు.
గత నెలరోజులుగా అమ్మకు ఎలా ఉందో తెలియక కూతురు.. బిడ్డజాడ గుర్తించలేని తల్లి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వేధింపులతో విసుగెత్తిపోయారు. 16 నెలలుగా అను భవిస్తున్న చిత్రహింసలతో మసరతబేగం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైంది.
నాలుగు రోజుల క్రితం మరణించినట్లు నగరంలోని చిన్నకూతురుకు సమాచారం ఇచ్చారు. మృత దేహాన్ని అప్పగించేందుకు 8000 రియాజ్‌లు చెల్లించాలంటూ డబ్బు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం హైదరాబా ద్‌లోని బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం వచ్చింది. ఆసుపత్రిలో తల్లీకూతుళ్లు చికిత్స పొందుతున్న ఫొటోలు పంపారు.
ఆ తర్వాత మొబైల్ స్విచాఫ్ అయింది. దీంతో బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అ క్కడ కేసు నమోదుచేయకపోవటంతో.. సా యం కోసం ఎంబీటీ పార్టీ నేతలను కలిశారు.
దీనిపై స్పందిన పార్టీ నేతలు సౌదీలోని భారతీయ అంబాసిడర్‌కు లేఖరాశారు. నిస్సహాయ స్ధితిలో ఉన్న తల్లీకూతుళ్లకు సాయం చేయా ల్సిందిగా కోరారు. మరణించినట్లుగా చెబుతున్న మసరతబేగం ఆచూకీ కోసం మరణించిం దా! బతికేఉందా!
అనే సమాచారం బంధువు లకు తెలియజేయాల్సిందిగా లేఖలో విన్నవించారు. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ పి.యాదగిరిని వివరణ కోరగా తల్లీకూతుళ్లిద్దరూ సౌదీలో క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. వీడియోద్వారా తమ క్షేమ సమాచారాన్ని తెలియజేసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నట్లు వచ్చిన ఫొటో లు పాతవని వివరించారు.

తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







