రజనీకాంత్ బర్త్‌డే కానుకగా 'బాషా' డిజిటల్ వర్షన్
- November 01, 2016
'ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు' అంటూ 1995లో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా విడుదలైన 'బాషా' సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. బాధ్యత గల అన్నయ్యగా, మంచి కుమారుడిగా, స్నేహితుడిగా రజనీ నటించిన ఈ సినిమా అభిమానుల హృదయాలను దోచుకోవడమే కాదు.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రం విడుదలై 21 ఏళ్లు పూర్తవుతుండగా.. ఈ ఏడాది డిసెంబరు 12న రజనీ పుట్టినరోజు కానుకగా 'బాషా' డిజిటల్ వర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తలైవా అభిమానులు కూడా సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంటూ..
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సురేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నగ్మా నటించారు. రఘువరన్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







