చర్మ కేన్సర్ ను నివారించే చిట్కాలు
- November 01, 2016
సూర్యకాంతికి బహిర్గతం అవటం వలన లేదా ఇతర కారణాల వలన చర్మ కణాలు అసాధారణంగా మరియు అసంఖ్యాకంగా పెరుగుటను చర్మ కేన్సర్ గా పేర్కొంటారు. కానీ, ఈ రకం కేన్సర్ సూర్యకాంతిలోని ప్రమాదకర రేడియేషన్ కు గురైనపుడు చర్మ ప్రాంతం కేన్సర్ కు గురవుతుంది.
ఎలా తెలుగులో స్కిన్ క్యాన్సర్ నిరోధించడానికి
సాధారణంగా చర్మం కేన్సర్ లు 3 రకాలు అవి:
బేసల్ సెల్ కార్సినోమా
స్క్వామస్ సెల్ కేన్సర్
మెలనోమా
లక్షణాలు
కంటిభాగం, తలపై చర్మ భాగం, ఛాతి, ముఖ ప్రాంతం, బాహుమూలాలు, మెడ, చేతులు మరియు కాళ్ళ వంటి ప్రాంతాలు సూర్యకాంతికి బహిర్గతం అవుతాయి కావున ఈ ప్రాంతాలు చర్మ కేన్సర్ కు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటుగా, అరచేతులు, చేతి వెళ్లు లేదా కాలి వెళ్లు మరియు వాటి గోళ్ల ప్రాంతంలో కూడా చర్మ కేన్సర్ కలగవచ్చు.
మెడ లేదా ముఖ ప్రాంతం సూర్యకాంతికి బహిర్గతమయ్యే వారిలో బేసల్ సెల్ కార్సినోమా కలిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మైనపు ముద్ద లేదా పుండుగా ఏర్పడటం వంటివి ఈ కేన్సర్ వ్యాధి యొక్క సాధారణ బహిర్గత లక్షణాలు.
స్క్వామస్ సెల్ కేన్సర్, ముఖ ప్రాంతం, చెవులు లేదా చేతులలో కలగవచ్చు. చర్మంపై ఎర్రటి బుడిపె వలే ఏర్పడటం లేదా చర్మంపై గరుకుగా గట్టి పొర ఏర్పడటం వంటివి ఈ రకం కేన్సర్ యొక్క బహిర్గత లక్షణాలు.
మేలనోమా కేన్సర్ కలిగి ఉన్న వారిలో గోధుమ రంగులో పెద్దగా ఒక మచ్చ ఏర్పడుతుంది. ఇదే ఈ రకం చర్మ కేన్సర్ యొక్క బహిర్గత లక్షణం.
ఈ వ్యాధిని ఎలా నివారించటం?
ఈ రకం కేన్సర్ నివారించాలంటే, కింద తెలిపిన చిట్కాలను అనుసరించండి
టానింగ్ కు దూరం
చర్మ కేన్సర్ కలగకుండా ఉండాలంటే టానింగ్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. సూర్యకాంతికి బహిర్గతం అవుకుండా చూసుకోండి. అధిక సమయం పాటూ ఎండలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సూర్యకాంతిలో ఉండే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు చర్మంపై అకాల వృద్దాప్య ముడుతలను కలిగించటమే కాకుండా, చర్మ కేన్సర్ ను కలిగించవచ్చు.
నీడలోనే ఉండండి
పగటిపూట వీలైనంత సమయం పాటూ నీడలో ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల పాటూ సూర్యకాంతి మెండుగా ఉంటుంది. కావున ఈ సమయంలో ఇంట్లో లేదా బయట ఉంటే నీడలో ఉండటానికి ప్రయత్నించండి.
దుస్తువులతో స్వతహాగా రక్షణ
సూర్యకాంతికి బహిర్గతం అయ్యే ముందు పొడవైన చేతులు కలిగన షర్టులను మరియు ప్యాంట్ లను ధరించండి. ఎండలో తిరిగేపుడు టోపీ మరియు సన్ గ్లాసు లను ధరించి, సూర్యకాంతి నుండి కలిగే ప్రమాదాలకు దూరంగా ఉండండి.
ఎలా తెలుగులో స్కిన్ క్యాన్సర్ నిరోధించడానికి
సన్ స్క్రీన్ అప్లై చేయండి
సన్ స్క్రీన్ లోషన్ ఎంపికలో తెలివిగా వ్యవహరించండి. మీరు ఎంచుకునే లోషన్ యొక్క సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) సూర్యకాంతి నుండి కనీసం 30 నిమిషాల పాటూ కాపాడేదిగా ఉండాలి. మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళే 15 నిమిషాల ముందు సన్ స్క్రీన్ ను అప్లై చేయండి.
తగినంత విటమిన్ 'D' పొందండి
విటమిన్ 'D' అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థాలను మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ఒకవేళ విటమిన్ 'D' అధికంగా గల ఆహార పదార్థాలను తీసుకోని ఎడల విటమిన్ 'D' ఉపభాగాలను (సప్లిమెంట్) తీసుకోండి.
సరైన సమయంలో చర్మ కేన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడటం చాలా ముఖ్యమైనది. సరైన సమయంలో నిర్దారణ చేయని ఎడల తీవ్ర పరిణామాలకు గురవ్వవలసి వస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









