ఖతార్ జనాభా ఆల్ టైమ్ హై 2.6 మిలియన్లు
- November 01, 2016
ఖతార్: ఖతార్ జనాభా 2.6 మిలియన్ల మార్క్‌ని చేరుకుంది. ఇది ఆల్ టైమ్ హైగా పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ (ఎండిపిఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్‌లో 2,611,000 మంది నివాసితులు ఉన్నారు. అక్టోబర్ చివరి నాటికి నమోదైన ఈ గణాంకాలు సెప్టెంబర్‌తో పోల్చితే 2.3 శాతం అధికం. సెప్టెంబర్‌లో కంట్రీ పాపులేషన్ 2,553,000గా ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా అత్యధికంగా నమోదైన సంఖ్య 2,587,000. మేలో ఈ సంఖ్య నమోదయ్యింది. జులైలో అత్యల్పంగా 2,326,000 సంఖ్య నమోదయ్యింది. సెలవుల కారణంగా వలసదారులు వెకేషన్లో ఉండటమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది నమోదైన 2.6 మిలియన్ సంఖ్యకున్న వ్యత్యాసం 8.3 శాతంగా లెక్కలు తేల్చారు. 2000 సంవత్సరంలో 614,000 మంది జనాభా ఉండగా, ఇది 2006లో తొలిసారిగా 1 మిలియన్ మార్క్‌ని దాటింది. 2008లో 1.5 మిలియన్ మార్క్‌ని చేరుకుంది. అక్కడినుంచి ప్రతి యేడాదీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







