మహేష్ -కొరటాల కాంబినేషన్ మరోసారి....
- November 01, 2016
సూపర్‌స్టార్ మహేష్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్ చిత్రం కంప్లీట్ కాగానే మహేష్ మరో సినిమాని అప్పుడే లైన్నో పెట్టేసాడు. అది శ్రీమంతుడితో ఇండస్ట్రీకి టాప్ 2 హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఉంటుందని ఎప్పుడో ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కబోతుంది. ఇక ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మహేష్ మురగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమాలోకి దూకేస్తాడన్నమాట. ఈ సినిమాలో మహేష్ పొలిటికల్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇక కొరటాల అప్పుడే ఆ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టేశాడని, మహేష్‌కి జోడిగా నటించే హీరోయిన్స్ వేటలో కొరటాల ఉన్నాడనే టాక్ కూడా బయటకొచ్చింది.
ఇక ఇప్పుడు మహేష్ -కొరటాల చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్రానికి టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందట. '్భరత్ అను నేను' అనే టైటిల్‌ని మహేష్‌కోసం కొరటాల ఫిక్స్చేసాడని సమాచారం.
మరి మహేష్‌ని ఈసారి మనం ముఖ్యమంత్రిగా లేదా ఒక మంత్రిగా చూడొచ్చన్నమాట. ఇప్పటికే మషేష్ దూకుడు సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించి అలరించాడు. మరి ఈ న్యూస్ గురించి క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు?
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







