దుబాయ్‌లో బెస్ట్ క్యాబ్ డ్రైవర్ ఈ లాయర్
- November 02, 2016
పాకిస్తానీ లాయర్ ఒకరు ట్యాక్సీడ్రైవర్‌గా మారి, బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్‌గా అవార్డును అందుకున్నారు. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) మంగళవారం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. 39 ఏళ్ళ ముంతాజిర్ హుస్సేన్, పాకిస్తాన్‌లోని సింధ్ హైకోర్టులో ఐదేళ్ళపాటు 'లా' ప్రాక్టీస్ చేశారు. అయితే 2008లో అనుకోకుండా ఆయన ట్యాక్సీ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. ఆర్టిఎ ఇటీవల బెస్ట్ ట్యాక్సీ డ్రైవర్లను ఎంపిక చేయగా, అందులో హుస్సేన్‌కి కూడా చోటు దక్కింది. ఆర్‌టిఎకి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి)లో హుస్సేన్ పనిచేస్తున్నారు. తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ ఆయన ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదు. స్వతహాగా లాయర్ని కావడంతో, నిబంధనల్ని జాగ్రత్తగా పాటించడం వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని చెప్పారు హుస్సేన్. 50 మంది బెస్ట్ క్యాబ్ డ్రైవర్స్‌లో ఒకే ఒక్క మహిళగా మెలనీ మంగులాబ్నన్ ఎంపికయ్యారు. 39 ఏళ్ళ మెలనీ గడచిన మూడేళ్ళలో యాక్సిడెంట్ చేయకుండా, ఎలాంటి జరీమానాలకూ లోనుకాకుండా డ్రైవ్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







