సౌదీ యువరాజుకి తప్పని జైలుశిక్ష... కొరడా దెబ్బలు

- November 02, 2016 , by Maagulf
సౌదీ యువరాజుకి తప్పని జైలుశిక్ష... కొరడా దెబ్బలు

రాజు తలచుకొంటే...దెబ్బలకేమి కొదువ ? ఇది మన తెలుగు సామెత..కానీ గల్ఫ్ దేశాలలో ముద్దాయి నేరం చేసినట్లు కోర్టు భావిస్తే ..యువరాజుకైనా కొరడా దెబ్బల శిక్ష తప్పదు..చట్టం తన పని తాను చేసుకొని పోతుందని పైకి గంభీరంగా చెప్పి...నేరాలలో ఇరుక్కొన్న తమ పిల్లలను దొడ్డి దారిలో కాపాడుకొనే రాజకీయ నాయకులను మన దేశంలో కోకొల్లలుగా చూసేం. తప్పు చేస్తే. ఎవరికైన శిక్ష ఒకటే అని ఈ ఘటన రుజువు చేస్తుంది. సాక్షాత్తు .. సౌదీ యువరాజు చట్టాన్ని అతిక్రమించిన నేరం ఆయనపై రుజువు కావడంతో ఆయనకు కారాగార శిక్ష..కొరడా దెబ్బలశిక్షను కోర్టు తీర్పును ఇచ్చి సంచలనం కల్గించింది.  ఎర్ర సముద్రం పక్కనే ఉన్న జెడ్డా నగరంలోని  ఒక జైలు లోపల సోమవారం మధ్యాహ్నం యువరాజుకు కొరడా దెబ్బల దండన జరిగింది. మరో రాజ కుటుంబీయుని హత్య కేసులో నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సౌదీ యువరాజుకు ఒక నెల రోజుల జైలుశిక్ష సైతం అదనంగా విధించబడింది. ఈ మేరకు శిక్ష విషయం కోర్టువర్గాలు బుధవారం నివేదించారు. కొరడా దెబ్బలను కొట్టే ముందు ఒక వైద్యుడు యువరాజు ఆరోగ్యస్థితిని పూర్తిగా పరిశీలించి  ఆయనకు ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించిన కమిటీ యువరాజుని తాళ్లతో కట్టి  కొరడా దెబ్బలు కొట్టండి అని ఆదేశించింది.  గత నెలలో సౌదీ యువరాజు, తుర్కీ  బిన్ సౌద్ బిన్ తుర్కీ అల్ కబీర్ , ఒక సామూహిక ఘర్షణలో హత్య కేసులో దోషిగా ఉన్నట్లు నిరూపితమైంది. అంతేకాక యువరాజు  బాధితుడి కుటుంబంకు రక్త ద్రవ్యం ఇచ్చేందుకు యత్నించి తద్వారా న్యాయస్థానంలో క్షమాభిక్ష పొందేందుకు ప్రయత్నించేడని..అయితే హత్యకు గురైన వ్యక్తి కుటుంబం అందుకు అంగీకరించలేదు పైగా సౌదీ యువరాజుని ఆ కుటుంబం క్షమించలేదు. సౌదీ అరేబియా యొక్క న్యాయ వ్యవస్థ షరియా చట్టం యొక్క ఒక కఠినమైన వివరణ అనుసరిస్తుంది నరహత్య మరియు యాదృచ్ఛిక నరహత్య మనుషుల మధ్య పౌర వివాదం వలె కాక భద్రతలను కాపాడేందుకు రాష్ట్రంలో దిద్దుబాటుకు అవకాశం లేని శిక్షని  అమలుచేస్తుంది. మరణం, గాయం, మరియు నష్టం సందర్భాలలో, ప్రాసిక్యూటర్ నిందితుడు లేదా కుటుంబం మరియు కుటుంబం లేదా వారసుడిని దియహ్  (రక్త డబ్బు లేదా బాధితుడు లేదా ఒక బాధితుడు వారసులుగా చెల్లించే ఆర్థిక పరిహారం) అంగీకరిస్తే హంతకుడిని  క్షమించేందుకు అవకాశముంటుంది. ఒకవేళ బాధితురాలి కుటుంబ రక్త డబ్బు కోసం ఒక క్షమాపణ ఇచ్చినపుడు  హంతకుడిని శిక్షించడానికి అవకాశం లేదు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com