103 హెరాయిన్ గుళికలు పొట్టలోదాచుకొన్న వ్యక్తి
- November 02, 2016
రాస్ అల్ ఖైమా: ' మేడి పండు చూడ ..మేలిమై ఉండు...పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ' అన్న చందాన ...ఓ స్మగ్లర్ తన బొజ్జనే అక్రమ రవాణాకు నిలయంగా ఏర్పర్చుకొన్నాడు...కానీ ఆ నిందితుడి ప్రణాళిక బెడిసికొట్టింది. మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు అదుపులోనికి తీసుకోగా అతని కడుపు లోపల 103 హెరాయిన్ గుళికలు ఉన్నట్లు కనుగొన్నారు. అతని పొట్టలో 98 హెరాయిన్ గుళికలు ఉంటె, 1 కిలో బరువు తూగే హెరాయిన్ పొడి ఆ వ్యక్తి గదిలో లభ్యమయ్యంది. దీనితో పాకిస్తానీయుడైన ఆ వ్యక్తి తన కడుపు లోపల దాగి 103 హెరాయిన్ గుళికలతో సహా రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా103 హెరాయిన్ గుళికలు 1.36 కిలో బరువు ఉన్న ఆ హెరాయిన్ విలువ 500,000 డి హెచ్ వరకు ఉంటుందని రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ శాఖ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ ఆలీ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







