ముల్బెర్రీ పండ్ల ప్రయోజనాలు
- November 02, 2016
ప్రపంచ వ్యాప్తంగా ముల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే. ఇవి మాత్రమే కాదు, జీవశాస్త్రపరంగా వైట్ ముల్బెర్రీల ఆకులు నుండి సేకరించే వాటిలో అధిక మొత్తంలో చైతన్యవంతమైన సమ్మేళనాలను ఉంటాయి మరియు ఈ పండ్లు చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 'మారుస్ ఆల్బా' వృక్షానికి కాచే ఈ పండ్లు మరియు ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన పండు వలన కలిగే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
ధమనులలో అడ్డంకులను తొలగిస్తాయి
ముల్బెర్రీల ఆకుల నుండి సేకరించిన సారం అథెరోస్క్లెరోసిస్ (రక్త సరఫరా చేసే ధమనులలో అడ్డంకులు ఏర్పడటం) ను తగ్గిస్తుంది. వీటి సారం అథెరోస్క్లెరోసిస్ కలిగించే LDL- కొలెస్ట్రాల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్స్) లను ఆక్సిడేషన్ ను గురి చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్ ల మూలాధారం
ముల్బెర్రీల వృక్ష ఆకులు, కాండం మరియు పండ్లు ఫ్రీరాడికల్ ల నుండి కలిగే ప్రమాదాలను నివారిస్తాయి. వీటిలో ఉండే "రెస్వెట్రాల్" అనే యాంటీ ఆక్సిడెంట్ లు వయసును ప్రభావిత పరచటమేకాకుండా, ఎక్కువ రోజుల పాటూ చైతన్యంగా ఉంటాయని "యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్" వారు ప్రచురించిన అధ్యయనాలలో పేర్కొన్నారు.
రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించటం
ముల్బెర్రీలో ఉండే సమ్మేళనాలు శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్య పరుస్తాయి. చైనాలో రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావటానికి ఔషదంగా వీటిని వాడుతున్నారు.
ఎరుపుదానాన్ని తగ్గిస్తుంది
చైనా యొక్క అనేక మంది ఆచరణకర్తలు చర్మంపై వచ్చే వాపులు మరియు ఎరుపుదనాన్ని మాన్చాటానికి గానూ ముల్బెర్రీలను వాడుతున్నారు. కర్కుమిన్ మరియు ముల్బెర్రీ ఆకులను కలిపి తయారు చేసిన మిశ్రమం చర్మంపై కలిగే చికాకుల వంటి సమస్యలను తగ్గించే ఔషదమని "రొమేనియన్"అధ్యయనాల వారు కనుగొన్నారు.
పోషకాలకు మూలం
ఎండిన ముల్బెర్రీలు ప్రోటీన్, విటమిన్ 'C', 'K', ఫైబర్ మరియు ఐరన్ లను కలిగి ఉంటాయి. కావున వీటిని రోజులో ఎపుడైన స్నాక్స్ గా తినవచ్చు. ఒకవేళ వీటి రుచి నచ్చని ఎడల, పండ్లలో ఉన్నంత మేరకు పోషకాలన్ కలిగి ఉండే వీటి ఆకులను కూడా ప్రయత్నించవచ్చు.
రోగనిరోధక వ్యవస్థకు మద్దతు
ముల్బెర్రీలలో కనుగొన్న ఆల్కలాయిడ్ లు భక్షకకణాలను చైతన్యవంతపరుస్తాయి, తెల్ల రక్తకణాలు రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపనకు గురి చేస్తాయి. ఈ భక్షకకణాలు రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసి ప్రమాదాల నుండి కాపడుతూ, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







