అబు బకర్ అల్ బాగ్దాదీని ఇరాక్ దళాలు చుట్టుముట్టియీ.....
- November 02, 2016
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని ఇరాక్ దళాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఐసిస్‌కు పట్టున్న మోసుల్ ప్రాంతానికి దాదాపు రెండేళ్ల తర్వాత ఇరాకీ దళాలు చేరుకోగలిగాయి. దీనిపై స్పందించిన కుర్దీష్ అధ్యక్షుని ప్రధాన అధికారి ఫాయిద్ హుస్సేన్.. ఆ ప్రాంతంలోనే బాగ్దాదీ ఉన్నట్లు పక్కా సమాచారముందని.. అతడ్ని అంతమొందించగలిగితే ఐసిస్ వ్యవస్థ మొత్తం పతనమవుతుందని వ్యాఖ్యానించారు. గత తొమ్మిది నెలలుగా అజ్ఞాతంలో ఉంటున్నాడని చెప్పారు. ఒకవేళ బాగ్దాదీ హతమైనా ఐసిస్ మరోనేతను ఎన్నుకుంటాయన్నారు.వాళ్లు కచ్చితంగా ఓడిపోతారని అయితే అది ఎప్పటిలోగా జరుగుతుందో చూడాలన్నారు. గతంలోనూ బాగ్దాదీ హతమైనట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆ దాడుల నుంచి బాగ్దాదీ సురక్షితంగా బయటపడటం గమనార్హం.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







