‘మహాత్మా జోతిరావుఫూలే’ ఫస్ట్‌లుక్!
- November 03, 2016
తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన ‘మహాత్మా జోతిరావుఫూలే’ ఫస్ట్‌లుక్!
చెలిమి విజన్ పతాకంపై డా॥ పి.ఎం. సుందరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహాత్మా జోతిరావుఫూలే’. నవంబర్ చివరి వారంలో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...`` తెలుగులో మొదటిసారిగా పూలే జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. ప్రేక్షకులు ఆదరించాలన్నారు.
చిత్ర దర్శక నిర్మాత పి.ఎం. సుందరరావు మాట్లాడుతూ... ‘సమాజంలోని అసమానతల్ని తొలగించి స్త్రీ విద్య వ్యాప్తికి కృషిచేసిన గొప్ప మహనీయుడు జోతిరావుఫూలే. ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అరవై మంది రంగస్ధల కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా లభిస్తాయన్న నమ్మకం వుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ చివరి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ టి.మహేష్ కూడా పాల్గొని గొప్ప వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి పని చేయడం సంతృప్తికరంగా ఉందన్నారు.
పి.ఎం. సుందరరావు, బెల్లంకొండ వెంకట్, ఎం.ఎస్. చార్లీ, అయినాల మల్లేశ్వరరావు, సోను, విఠల్ ప్రసాద్, యోహాన్, మిలటరీ ప్రసాద్, చిలువూరు నాగేశ్వరరావు, విజయలక్ష్మి, దుర్గ, మీనాక్షి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.లక్ష్మణ్, సంగీతం: కరుణాకర్, ఎడిటింగ్: మహేష్ తుపాకుల.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







