సురెందర్ రెడ్డిని కాదనడం నిజంగా అవమానమే...
- November 03, 2016
తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా 'నిన్ను చూశాక' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలు ఉండటంతో మనోడికి ఇండస్ట్రీలో అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఇక డ్యాన్స్, ఫైట్స్,నటన పరంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా మూడు హిట్స్ కొట్టి టాప్ నెంబర్ వన్ రేసు లో ఉన్నాడు. అలాంటిది ఎన్టీఆర్ స్వయంగా ఓ డైరెక్టర్ కి సినిమా ఆఫర్ ఇస్తే చేయనని నిర్మోహమాటంగా చెప్పి తప్పుకున్నాడట.ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కాల్ షీట్స్ కోసం ఎదురు చూసే దర్శక,నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు.ఇలాంటి సమయంలో స్వయంగా తానే సినిమా తీయాలని దర్శకుడిని అడగడం అతను కాదనడం నిజంగా అవమానమే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా..! ఎన్టీఆర్ కి ''అశోక్ '' , '' ఊసరవెల్లి '' చిత్రాలు అందించి సురెందర్ రెడ్డి.అయితే ఆ రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయాన్ని పొందాయి ఎన్టీఆర్ తో హిట్ ఇవ్వలేక పోయాడు కానీ కిక్ , రేసుగుర్రం , అతనొక్కడే వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం రాంచరణ్ తేజ్ తో ధృవ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ తో మరో సినిమా తీస్తున్నాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







