పాత పాస్‌పోర్టులతో ఒమన్‌లోకి ఎంట్రీ కష్టమే
- November 03, 2016
మస్కట్: చేతి రాతతో కూడిన పాస్‌పోర్ట్‌లు కలిగిన వలసదారులు, ఒమన్‌లోకి అడుగు పెట్టడం ఇకపై కష్టమే కాదు, అసాధ్యం కూడా కావొచ్చు. ఎంబసీ అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. మస్కట్‌లోని నేపాల్ ఎంబసీ అధికారి రోజినా తమ్రాకర్ మాట్లాడుతూ, నేపాల్ గవర్నమెంట్, అంతర్జాతీయ విమానాల్లోకి చేతి రాత కలిగిన పాస్‌పోర్టుల్ని అనుమతించడంలేదని చెప్పారు. ఇండియన్ ఎంబసీకి చెందిన సీనియర్ అధికారి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ మేరకు విధించిన డెడ్‌లైన్ నవంబర్ 24తోనే ముగిసింది. అయితే కొన్ని దేశాల్లో ఈ గడువు కాస్త పొడిగించబడింది. ఇకపై నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేయనున్నామనీ, మెషీన్ రీడర్ పాస్‌పోర్ట్ ఉన్నవారికి తప్ప చేతి రాత పాస్‌పోర్ట్‌లను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. వలసదారులు తమ తమ ఎంబసీలను సంప్రదించి వీలైనంత త్వరగా తమ పాస్‌పోర్ట్‌లను మార్చుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







