దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌కు ఆడీ కారును బహుమతి...
- November 03, 2016
దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ప్రేక్షకుల హృదయాలనే కాదు నిర్మాతల హృదయాలనూ దోచుకున్నారు. ఇలా అనడానికి కారణం లేకపోలేదు.. ఎ.ఎల్.విజయ్‌కు నిర్మాత ఐసరి కె గణేశ్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కలిసి ఆడీ కారును బహుమతిగా ఇచ్చారట. 'దేవి' చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. 'కష్టం ఫలితాన్ని ఇస్తుంది! ప్రభుదేవా, కె.గణేశ్ కలిసి కారును బహూకరించిన 'దేవి' దర్శకుడు విజయ్‌కి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేసింది.ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దేవి'. ఈ చిత్రాన్ని తెలుగులో 'అభినేత్రి', తమిళంలో
'దేవి', హిందీలో 'టుటక్ టుటక్ టుటియా' టైటిల్స్‌తో విడుదల చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







