సాధారణ స్థితికి వచ్చిన అమ్మ..
- November 03, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సాధారణ స్థితికి వచ్చినట్లు గురువారం అధికార అన్నాడీఎంకే వెల్లడించింది. జయలలిత ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు పార్టీ నాయకురాలు సీఆర్ సరస్వతి తెలిపారు. ఆమె ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్రుత్తి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగైనట్లు తెలిపారు. ప్రజల ప్రార్థనలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు.
అమ్మకు నటి శారద పరామర్శ
ముఖ్యమంత్రి జయలలితను సీనియర్ నటి ఊర్వశి శారద గురువారం ఉదయం అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
అమ్మ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శారద మీడియాతో మాట్లాడుతూ.. జయలలితను చూడటానికి బాధగా వెళ్లానని, అయితే డాక్టర్ల మాటలు విన్నాక చాలా ఆనందంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి జయలలిత 45 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







