సైతాన్ ఆడియో విడుదల...
- November 03, 2016
'పిచ్చైక్కారన్' తర్వాత విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం 'సైతాన్'. అరుంధతి నాయర్ కథానాయిక. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. సుజాత రాసిన ఓ నవల ఆధారంగా ఈ కథను రూపొందించారు. తెలుగు హక్కులను శివకుమార్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 'ఇలయ తలబది' విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభ, దర్శకుడు శశి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు విజయ్ క్రమక్రమంగా ఎదిగిన తీరు తనకు ఆనందాన్ని కలిగించిందని, అదేవిధంగా ఇప్పుడు విజయ్ ఆంటోని కూడా ఎదుగుతూంటే అదే ఆనందాన్ని పొందుతున్నానని చెప్పారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ సాధారణంగా తాను నటించిన సినిమాల చిత్రీకరణ త్వరగా అయిపోతుందని, ఈ సినిమా మాత్రం కాస్త ఆలస్యమైందన్నారు. దర్శకుడు కృష్ణమూర్తి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని, ఈ సినిమా ఆయనకు చక్కని గుర్తింపునిస్తుందని చెప్పారు. అనంతరం తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న శివకుమార్ మాట్లాడుతూ తెలుగులో 'బిచ్చగాడు' (పిచ్చైక్కారన్) భారీ విజయాన్ని సొంతం చేసుకుందని, అదేవిధంగానే ఈ సినిమా కూడా తెలుగులో హిట్ అవుతుందన్న నమ్మకం తనకుందన్నారు. తాము విడుదల చేసిన ఇరుముగన్, దేవి చిత్రాల మాదిరిగా 'సైతాన్' కూడా గుర్తింపు తెస్తుందని ఆరో సినిమాస్ మహేష్ చెప్పారు.
అనంతరం నటుడు శిబిరాజ్ ప్రసంగిస్తూ.. పిచ్చైక్కారన్, సైతాన్ వంటి టైటిల్ పెట్టాలంటే ధైర్యం ఉండాలన్నారు. కథ ఎంచుకునే తీరు, కఠోర శ్రమ.. విజయ్ ఆంటోనికి మరింత గుర్తింపు తెస్తాయన్నారు.
సినిమా అంటే ఎంత అంకితభావంతో పని చేస్తున్నారో అర్థమవుతోందని, ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలోని తదుపరి సినిమాలో తాను హీరోగా నటిస్తున్నానని చెప్పారు. చిత్రం రూపొందించడం కన్నా.. సినిమాను విడుదల చేయడమే ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







