అన్నయ్యసినిమాలోనే విలన్ పాత్ర చేస్తా.... కార్తీ..
- November 04, 2016
నాకు విలన్ రోల్ చేయాలని వుంది. అయితే అన్నయ్య సూర్య సినిమాలోనే ఆ పాత్ర చేస్తా. అంతే తప్ప ఇతర హీరోలకు విలన్ గా కనిపించను"అని చెప్పాడు హీరో కార్తీ. కార్తీ కొత్త సినిమా కాష్మోర. ఇటివల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన కార్తీ ఓ ప్రశ్నకు పై సమాధనం ఇచ్చారు.ఇంకా సినిమా గురించి చెబుతూ.. 'ఈ సినిమా ఆడుతుందని నమ్మి చేశా. వూహించిన దానికన్నా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాతో నా మార్కెట్ పెరిగిందనుకుంటున్నా. ఈ సినిమాని అన్నయ్యతో కలిసి చూశా. నా నటన చూసి అన్నయ్య షాక్ అయ్యారు. అన్నయ్య కు సినిమాలో'రాజ్‌నాయక్' పాత్ర బాగా నచ్చింది" అని చెప్పుకొచ్చాడు కార్తీ.ఇక కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మణిరత్నం సినిమా షూటింగ్ జరుగుతొందని, ఆ తర్వాత ఓ పోలీస్ స్టోరీ చేస్తానని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వెల్లడించాడు కార్తి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







