సినిమా రివ్యూ : మనలో ఒకడు
- November 04, 2016
నటీనటులు : ఆర్పీ పట్నాయక్, అనిత, సాయికుమార్ తదితరులు
కథ, కథనం, సంగీతం, దర్శకత్వం : ఆర్.పి.పట్నాయక్
నిర్మాత : గురుజాల జగన్మోహన్
విడుదల తేదీ : నవంబర్ 4, 2016
బ్రోకర్ చిత్రంతో దర్శకుడిగా మారాడు ఆర్పీ పట్నాయక్. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం మనలో ఒకడు. మీడియా ఇగో ను రెచ్చగొట్టేలా ఈ చిత్రం ఉంటుంది అని ఆర్పీ చెప్పడంతో సినిమా పై అందరిలో ఆసక్తి పెరిగింది. మీడియా గురించి ఆర్పీ ఏం చూపించారు? సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : ఒక కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ కృష్ణమూర్తి (ఆర్.పి.పట్నాయక్). అతని భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది.
ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితంలో ఓ న్యూస్ ఛానెల్ లో ప్రసారం అయిన వార్త తో కలకలం రేగుతుంది. ఉద్యోగం పోతుంది. భార్య,,భర్తల మధ్య విభేదాలు మొదలవుతాయి. సమాజంలో ఒక నేరస్థుడిగా మిగిలిపోతాడు. కృష్ణమూర్తి జీవితం తల్లక్రిందులవడానికి కారణమైన ఆ వార్త ఏమిటి..? కృష్ణమూర్తి కి న్యూస్ ఛానెల్ ఎండీ ప్రతాప్ (సాయికుమార్ ) కి ఉన్నసంబంధం ఏమిటి..? లైంగిక ఆరోపణల నుంచి ఎలా బయటపడ్డాడు.? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బలాలు..బలహీనతలు : ఎంచుకున్న కథాంశమే సినిమాకు పెద్ద బలం. ఇక ఆర్పీ పట్నాయక్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అనిత, సాయికుమార్, నాజర్, శ్రీముఖి తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఒక తప్పు జీవితాల్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది? మీడియాకి అహం ఉంటే ఆ ప్రభావం సమాజంపై ఎంతగా ఉంటుందో కళ్లకుకట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తన పై వచ్చిన ఆరోపణలకు కృంగి పోకుండా తను తప్పు చేయలేదు అని నిరూపించేందుకు ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలను దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించాడు.
ప్రీ క్లైమాక్స్ లో నాజర్, సాయి కుమార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. ఫస్టాప్ లో కథలో లీనం అయిన ప్రేక్షకుడికి సెకండాఫ్ లో కొన్ని సీన్లు విసుగుతెప్పిస్తాయి. తప్పు ఎవరు చేశారో ఫస్టాప్ లోనే తెలిసిన అతడిని పట్టుకోకుండా ఉండడం కూడా ప్రేక్షకుడికి అర్థం కాదు. చిత్ర క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. ఆర్పీ పట్నాయక్ కథని తీర్చిదిద్దిన విధానం, సంగీతం సినిమాకి బలాన్నిచ్చాయి. తిరుమల్‌నాగ్ మాటలతో పాటు సిద్ధార్థ్ కెమెరా పనితనం బాగుంది.
కామెంట్ : మీడియాకే మొట్టికాయ
రేటింగ్ః 2/5
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







