రివ్యూ : ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి
- November 04, 2016
నటీనటులు : కాళకేయ ప్రభాకర్, ఏ.రవితేజ, అశ్విని..
సంగీతం : ఎం.టి.కవి శంకర్
దర్శకత్వం : ఎస్.జె.చైతన్య
నిర్మాత : రవి పచ్చిపాల
విడుదల తేదీ : నవంబర్ 4, 2016
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఆయన పేరుతో వచ్చిన సినిమా ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ : నెల్లూరులో నాని(ప్రభాకర్) అంటే అందరికి భయం. కబ్జాలు, సెంటిల్ మెంట్లు చేస్తుంటాడు. నానిని ప్రేమ పేరుతో ఒక అమ్మాయి మోసం చేస్తుంది. అప్పటి నుంచి ప్రేమన్న, ఆడాళ్లు అన్నా, ఆఖరికి తన చెల్లెన్న నచ్చదు. ఇక నాని చెల్లెలు అమృత(అశ్విని).ప్రభాస్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది.
ఈ విషయాన్ని తన అన్నయ్యతో చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ (రవితేజ) అనే మరో వ్యక్తి అమృతకు సాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఈ ప్రభాస్ ఎవరు? అమృతకు సహాయం చేయడానికి అతడెందుకు ముందుకొస్తాడు? మరీ నాని ని ఒప్పించారా..? అశ్విని ప్రేమించిన ప్రభాస్ ఎవరు..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బలాలు..బలహీనతలు : ఈ సినిమాకి ఎంచుకున్న కథాంశమే ప్రధాన బలమని చెప్పాలి. కాళకేయ ప్రభాకర్ నటనతో ఆకట్టుకున్నాడు. రవితేజ, అశ్విని ల నటన ఫర్వాలేదు. ఒక మంచి పాయింట్ ను ఎంచుకున్న దర్శకుడు మంచి స్ర్కిప్ట్ ను రూపొందించుకోకపోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్. సీరియస్ కథాంశాన్ని కామెడీతో చెప్పాలనుకున్న దానికి తగ్గట్లు సన్నివేశాలను రూపొందించలేదు. సినిమాలోని కామెడి నవ్వు తెప్పించకపోగా ఆసహనం కలిగిస్తుంది. ఇంటర్ వెల్ ట్విస్ట్ ఒక్కటే సినిమా మొత్తంలో బాగుంది. సినిమాలో కథ లేకపోవడం ఉన్న కాసింత కథను ఫస్టాప్ లో నే చెప్పేడం సినిమా రెండున్నర గంటలు ఉండాలి కాబట్టి క్లైమాక్స్ వరకు అనవసరమై కామెడీ ట్రాక్ లను ఇరికించే ప్రయత్నం చేశాడు,
ఇక క్లైమాక్స్‌ని అర్థాంతరంగా ముగించేసి, ఆవు పులి మధ్యలో అనుష్క పెళ్ళి అంటూ సీక్వెల్‌ను అనౌన్స్ చేయడం నవ్వుతెప్పిస్తుంది. సినిమాలో రెండే పాటలున్నా ఆ రెండూ వినడానికి ఏమాత్రం బాగోలేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫర్వాలేదు. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ ఉన్నంతలో కథ మూడ్‌కి తగ్గట్టు బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.
కామెంట్ : ఆవు పులి మధ్యలోనే పారిపో.
రేటింగ్ః 1/5
తాజా వార్తలు
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!









