పనీర్, మష్రూమ్ సూప్
- November 04, 2016
కావలసిన పదార్థాలు : వెజిటెబుల్ స్టాక్ - 3 కప్పులు, బటన్ మష్రూమ్ ముక్కలు - 1 కప్పు, పనీర్ - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - పావు టీ స్పూను, మెదిపిన అల్లం - అంగుళం ముక్క, లెమన్ గ్రాస్ - 1 కట్ట, సోయా సాస్ - 1 టీ స్పూను, టమోటాలు - 2, ఉల్లి కాడల తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను, నిమ్మరసం - అర టీ స్పూను, కొత్తిమీర కాడలు - అలంకరణకు.
తయారుచేసే విధానం : వెజిటెబుల్ స్టాక్‌లో మష్రూమ్ ముక్కలు, పనీర్, పచ్చిమిర్చి, అల్లం, లెమన్ గ్రాస్ వేసి కలపాలి. మిశ్రమం కమ్మటి వాసన వచ్చేవరకు (సుమారు 5 నిమిషాలు) చిన్నమంటపై మరిగించాలి. తర్వాత సోయాసాస్, టమోటా ముక్కలు, ఉల్లి కాడలు, కొత్తిమీర, ఉప్పు కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. దించేముందు నిమ్మరసం కలిపి కొత్తిమీర కాడలతో అలంకరించి తాగాలి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







