రాఖీ సావంత్ పై ఎఫ్ఐఆర్
- November 04, 2016
అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలున్న కురచ దుస్తులు ధరించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సృష్టించిన సంచలన అంతాఇంతా కాదు.
'ఆ డ్రెస్ తో మోదీ పరువు తీసింది..!'
అని తనపై దుమ్మెత్తి పోసివాళ్లకు ' మోదీ నా డ్రీమ్ మ్యాన్' అని ధీటుగా జవాబిచ్చిందామె. అయితే కాలప్రవాహంలో సర్దుమణిగిందనుకున్న ఆ వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది.
అసభ్యకరమైన దుస్తులు ధరించారన్న కారణంగా నటి రాఖీ సావంత్ పై రాజస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. రాజసమండ్ జిల్లా కాంక్రోలీ పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి నమోదుచేసిన కేసు వివరాలను ఆ స్టేషన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాంక్రోలీకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిద్యాదుమేరకు రాఖీ సావత్ పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. దీనిపై నటి స్పందన వెలువడాల్సిఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







