ఆదిత్య మ్యూజిక్ ద్వారా కాటమరాయుడు, ధృవ, డి.జె, ఫిదా, నేను లోకల్ తదితర ఆడియోలు విడుదల
- November 04, 2016
ఆదిత్య మ్యూజిక్ ద్వారా కాటమరాయుడు, ధృవ, డి.జె, ఫిదా, నేను లోకల్ తదితర ఆడియోలు విడుదలగత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల పాటలను అందించిన ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ మూవీస్ ఆడియోలను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్ లో రిలీజ్ చేయనుంది.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ గుప్త మాట్లాడుతూ....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 21 చిత్రాల్లో బద్రి, ఖుషి, జల్సా,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది...తదితర 15 చిత్రాల ఆడియోలను మా సంస్ధ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఆడియోను మా ఆదిత్య సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 9 చిత్రాల్లో చిరుత, మగధీర, ఆరెంజ్, ఎవడు తదితర 7 చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ధృవ. ఈ ధృవ చిత్రం ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే విడుదల చేస్తున్నాం.
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.... ఆర్య, పరుగు, జులాయి, ఇద్దరమ్మాయిలతో.., సన్నాఫ్ సత్యమూర్తి ఇలా 15 చిత్రాల్లో 12 చిత్రాల ఆడియోలను మేమే రిలీజ్ చేసాం.ఇప్పుడు డిజె దువ్వాడ జగన్నాథమ్ ఆడియోను కూడా మేమే రిలీజ్ చేస్తున్నాం. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద, లోఫర్, కంచె చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే విడుదల చేసాం. వరుణ్ తేజ్ తాజా చిత్రం ఫిదా ఆడియోను కూడా మేమే రిలీజ్ చేస్తున్నాం.
కాటమరాయుడు, ధృవ, డిజె దువ్వాడ జగన్నాథమ్, ఫిదా చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. గోపీచంద్ ఆక్సిజన్, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న నాని నేను లోకల్, శర్వానంద్ శతమానంభవతి, హెబ్బాపటేల్ నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ హీరోగా ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఇదే సంస్థ రాజ్ తరుణ్ తో నిర్మిస్తున్న మరో సినిమా ఆడియోను కూడా మా సంస్థ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం అని తెలియచేసారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







