నవంబర్ 10వ తేదీన అనంతపురంలో పవన్‌కళ్యాణ్ సభ...
- November 05, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' కోసం ఓ స్పెషల్ సాంగ్ విడుదల అయింది. ప్రజల గుండె రగిలెరా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను బద్రీనాయుడు రాయగా, ఎమ్మెస్ వాసు పాడారు.నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఈ సభ జరగనుందని, దీనికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు తెలిపాయి.ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంత కరువు, సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ స్పందించనున్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై అంతటా హాట్ టాపిక్ నెలకొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







