'మీలో ఎవరు కోటీశ్వరుడు' యు/ఎ సర్టిఫికెట్ పొందింది...
- November 05, 2016
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్‌టైనర్‌ని చూడలేదని, సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.వసంత్ ఈచిత్రానికి సూపర్‌హిట్ మ్యూజిక్‌ని ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లోనే ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







