దుబాయ్‌లో షారుఖ్‌ఖాన్ షూటింగ్
- November 05, 2016
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్, దుబాయ్‌లో శుక్రవారం 'షూటింగ్' కోసం వచ్చారు. దుబాయ్ టూరిజంకి సంబంధించి పలు వీడియోల షూటింగ్ కోసం వచ్చిన షారుక్‌ఖాన్ దుబాయ్‌తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. దుబాయ్‌ని తన రెండో సొంతిల్లులా పేర్కొన్న షారుక్‌ఖాన్, సినిమా షూటింగుల కోసం, స్నేహితులతో సరాదాగా విహారం కోసం దుబాయ్‌కి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాననీ, ఈ క్రమంలో దుబాయ్ వాసులు తనను ఆదరించే తీరు చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. దుబాయ్ తనకు ఎంతో నచ్చిన సిటీ అని అన్నాడు షారుక్‌ఖాన్. డిసెంబర్లో దుబాయ్ టూరిజం తరఫున ఈ వీడియోస్ పలు ఛానళ్ళలో ప్రసారం కానున్నాయి. దుబాయ్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ ఈ వీడియోల్ని చిత్రీకరిస్తోంది. షారుక్‌ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిలిం 'హ్యాపీ న్యూ ఇయర్' దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంది. 'డియర్ జిందగీ' సినిమాలో నటిస్తున్నాడు షారుక్ ప్రస్తుతం. అలియా భట్ ఈ చిత్రంలో హీరోయిన్. గౌరీ షిండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







