ట్రాపిక్ ఉల్లంఘనలపై 4-జి కెమెరాల కన్ను
- November 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వాహనాలకు 4 జి ఎనేబుల్డ్ కెమెరాలను అమర్చి, ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఎమర్జన్సీ కేసుల విషయంలోనూ అలాగే రెసిడెంట్స్‌కి మరింత భద్రతను అందించేందుకుగాను వీటిని వినియోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, ఈ లేటెస్ట్ సెక్రూరిటీ ప్రోగ్రామ్ - వెహికిల్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్‌ని ఇటీవల ప్రదర్శించింది. 4జి ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మెరుగైన క్లారిటీతో వీడియోల్ని చిత్రీకరించి, కంట్రోల్ రూమ్‌లో వాటిని విశ్లేషించగలుగుతారు. తద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడమే కాకుండా, అవసరానికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో ట్రాపిక్‌ని క్రమబద్దీకరించడం వీలవుతుంది. లెఖ్వియా, అల్ ఫజా వాహనాల్లో వీటిని అమర్చుతారు. గతంలో జిపిఎస్‌పై ఆధారపడి ట్రాపిక్ డిపార్ట్‌మెంట్ పనిచేసింది. ఈ కొత్త విధానం ద్వారా మెరుగైన ఫలితాల్ని సాధించగలమని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని సేకరించడం కూడా వేగవంతమవుతుంది ఈ విధానం ద్వారా.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







