రెడ్ ఎఫ్ ఎమ్ లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ సాంగ్ లాంఛ్
- November 05, 2016
క్రేజీ కమెడియన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. అంతకంటే ముందుగా నవంబర్ 6న ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే ఆడియో ప్రమోషన్స్ లో భాగంగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ తాజాగా 93.5 రెడ్ ఎఫ్ ఎం లో సందడి చేసింది. చిత్రంలో ఉన్న సప్తగిరి పోషించిన క్యారెక్టర్ గెటెప్ తో పాటు ఆడియోలో ఉన్న ఓ మాస్ మసాలా పాటను సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా
సప్తగిరి మాట్లాడుతూ
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవి కిరణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిచారని, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడని, నవంబర్ 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో రిలీజ్ జరగనుందని, ఓ అభిమాని నటించిన సినిమా ఆడియోకు పవన్ అతిధిగా రావడం నిజంగానే విశేషమంటూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం ఈ చిత్రాన్ని ఆదరించాలని అన్నారు.
దర్శకుడు అరుణ్ పావర్ మాట్లాడుతూ
త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేసిన అనుభవంతో, సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను వినోదాత్మకంగా తెరకెక్కించినాని, గతంలో మురారి, లెజెండ్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారని, బుల్గానిన్ ఇచ్చిన ట్యూన్స్ శ్రోతల్ని ఆకట్టుకుంటాయని, నవంబర్ 6న పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా జరగబోతున్న ఆడియో వేడుకను అభిమానులంతా సక్సెస్ చేయాలని కోరారు. అలానే ఈ సినిమాలో సప్తగిరి ఓ కానిస్టేబుల్ గా నటిస్తున్నారని తెలిపారు.
ఇక నవంబర్ 6న జరగబోతున్న ఆడియో వేడుక కోసం సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిర్మాత డా.రవికిరణ్ భారీగా సన్నాహాలు చేస్తున్నారు. లహరి/టీ సిరీస్ కంపెనీ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల అవుతోంది. ఇటీవలే విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో త్వరలోనే విడుదల కాబోతున్న ఆడియోకు, ఆ తరువాత వచ్చే సినిమాకు అదే రీతన స్పందన వస్తోందని సప్తగరి ఎక్స్ ప్రెస్ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. నవంబర్ మూడో వారంలో విడుదల చేయబోతున్న ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, ఎడిటిర్ : గౌతంరాజు, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల'
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







