నవంబర్ 25న మోహన్ లాల్ 'మన్యం పులి'
- November 05, 2016
మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'పులిమురుగన్' చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తున్నారు శ్రీ సర్వసతి ఫిల్మ్స్ అధినేత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఇప్పటికే 'మన్యం పులి' సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో మన్యం పులి ని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాటు ఫుల్ క్రేజ్ రావడంతో, అదే ఊపులో 'మన్యంపులి' సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







