నెవడాలో డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా కలకలం
- November 06, 2016
నెవడాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ట్రంప్ ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేసిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, ఆయనకు రక్షణగా నిలిచి, హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నెవడాలో జరిగిన ప్రచారంలో అలజడి రేగింది. ట్రంప్ ప్రచారకార్యక్రమంలో ఓ వ్యక్తి తుపాకితో ప్రవేశించాడనే వైట్‌హౌస్ రహస్య భద్రతా సిబ్బంది హెచ్చరికలు అంతా ప్రకంపనలు సృష్టించాయి.
సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ట్రంప్‌ను వేదికపై నుంచి అత్యంత భద్రత మధ్య కిందికి తీసుకెళ్లారు.కొద్దిసేపు సభా ప్రాంగణాన్ని జల్లెడ పట్టారు. ఎవరిదగ్గరా తుపాకీ లేదని నిర్ధారించిన అనంతరం ట్రంప్‌ని మరలా వేదిక పైకి తీసుకొచ్చారు.అనంతరం ట్రంప్ మాట్లాడారు. మనల్ని ఎవరూ, ఎప్పడూ ఆపలేరని ఆవేశంగా ప్రసంగించారు. రహస్య భద్రతా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, వారి కృషిని ప్రశంసిస్తున్నట్లు చెప్పారు.అసలేం జరిగింది?ట్రంప్ సభా వేదిక పైకి వస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ట్రంప్ పైకి దూసుకురావడాన్ని భద్రతాధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షణాల్లో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్‌ని అక్కడ నుంచి దూరంలో తీసుకెళ్లారు. అనుమానితుల విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తులను వదిలేయగా మరోవ్యక్తిని అదుపులోనే ఉంచారు. మూడో వ్యక్తి వ్యూహాత్మకంగా వేషధారణ చేసుకోవడం పలు అనుమానాలకు దారితీయడంతో పోలీసుల విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







