'బేతాళుడు' ఆడియో విడుదల
- November 06, 2016
తనపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఎంతో ఆనందంగా ఉందని, మూడో సినిమాకే ఇంత గుర్తింపు వస్తుందనుకోలేదని కథానాయకుడు విజయ్ ఆంటోని అన్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం 'బేతాళుడు'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని దర్శకుడు బోయపాటి శ్రీను, ఆడియో సీడీలను హీరో నిఖిల్‌లు విడుదల చేసి విజయ్ ఆంటోనికి అందించారు. కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్, ఫాతిమా విజయ్ ఆంటోని, చదలవాడ శ్రీనివాసరావు, కె.వి.వి. సత్యనారాయణ, అరుంధతి నాయర్, నిర్మాత శ్రీనివాస్, దర్శకుడు అజయ్‌కుమార్, సంతోషం సురేష్ కొండేటి, టి.ప్రసన్నకుమార్, కె.కె.రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు.మల్కాపురం శివకుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో మానస్ రిషి ఎంటర్‌ప్రైజెస్, విన్‌విన్‌విన్ క్రియేషన్స్, ఆరా సినిమాస్ బ్యానర్‌పై కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







