జమ్ముకశ్మీర్లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి
- November 06, 2016
జమ్ముకశ్మీర్లో ఇప్పటికీ 300 మంది మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారని, అశాంతిని రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ రాజేంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీతో జరిగిన సమావేశంలో 'సరిహద్దుల వెంట మిలిటెంట్లు ఆందోళన కలిగించే పనిలో ఉన్నారని, దాని వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని' డీజీపీ ఆమెకు వివరించారు. నాలుగు నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్వానినీ హతమార్చాక, రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 250-300 మంది వరకు మిలిటెంట్ల కదలికలు చురుగ్గా ఉన్నాయని, వారి కదలికలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.
వారు ఇప్పటికే కశ్మీర్ లోయలో 70 భవనాలను తగులబెట్టారని, వాటిలో 53 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. మిలిటెంట్లుకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు జరుగుతున్నాయని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







