నవంబర్ 11న విడుదల కానున్న 'సింగం 3' ట్రైలర్
- November 06, 2016
సూర్య హీరోగా చేస్తున్న 'సింగం' కొనసాగింపు చిత్రం 'సింగం 3'. అనుష్క, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుష్క సూర్య భార్యగా కనిపించబోతుంది. శృతి హాసన్ జర్నలిస్టుగా చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. 'సింగం-3' తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్ర తమిళ, తెలుగు భాషల టీజర్‌ను సోమవారం విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ''అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే విధంగా ఈ చిత్రముంటుంది. ఈ చిత్రంలో సూర్య నట విశ్వరూపం చూడబోతున్నారని నిర్మాత తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది.
నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. డిసెంబర్ 16న విడుదల కానుంది'' అని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







