'జగపతి పిక్చర్స్'ను మరోసారి వెలుగులోకి తీసుకురానున్న జగపతి
- November 06, 2016
లెజెండ్‌తో జగపతిబాబు కెరీర్ ఫుల్ టర్న్ అయ్యింది. అంతకు ముందు హీరోగా. డెడ్ ఎండ్‌లో ఉన్న జగపతిబాబు.. ప్రతినాయకుడిగా ఎప్పుడైతే యూటర్న్ తీసుకొన్నాడో అప్పటి నుంచీ ప్రయాణం జోరందుకొంది. జితేంద్రగా జగపతి పండించిన విలనిజం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా జగపతి బాబు గ్రాఫ్ మరో స్థాయికి లేచింది. ఇప్పుడు జగపతి బాబు అంటే క్రేజీ ఆర్టిస్ట్. ఆయనకు వరుసగా క్రేజీ క్రేజీ పాత్రలు పడుతున్నాయి.
ఈ స్వింగ్ లోనే జగపతి బాబు ఇప్పుడు మరోసారు హీరోయిజం చూపించడానికి రెడీ అవుతున్నారు. జగపతి బాబు హీరోగా 'జగపతి పిక్చర్స్'పై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను వాసు పరిమి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు.ఈ చిత్రానికి జాగ్వార్ నిర్మాత కుమారస్వామి కూడా ఓ బాగస్వామిగా వుంటారు.
ఈ సినిమా జగపతి బాబుకు వెరీ స్పెషల్. ఈ సినిమాతో తండ్రి కోరికను నేరవేరుస్తున్నారు జగపతి బాబు. 'జగపతి పిక్చర్స్'అంటే ఒకప్పుడు బడా బ్యానర్. అయితే కొంత కాలంగా ఆ బ్యానర్ నుండి సినిమాలు రావడం లేదు. జగపతి బాబు తండ్రి రాజేంద్రప్రసాద్ బ్యానర్ ను మళ్ళీ యాక్టివ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆయన కాలం చేశారు. ఇప్పుడు తండ్రి కోరిక పై 'జగపతి పిక్చర్స్' మరోసారి వెలుగులో తీసుకురావడానికి సిద్దం అవుతున్నారు జగపతి బాబు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







