కమలా తొక్కల కూర
- November 06, 2016
కావలసిన పదార్థాలు: కమలా తొక్కలు - ఒక కప్పు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, చింతపండు - నిమ్మకాయ సైజులో, కారం - ఒక టీస్పూన్, ధనియాల పొడి - మూడు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్.
తాలింపుకు: నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు (నువ్వులనూనె), ఆవాలు - ఒక టీస్పూన్, మినపప్పు - రెండు టీస్పూన్లు, జీలకర్ర - ఒక టీస్పూన్, శెనగపప్పు - రెండు టీస్పూన్లు.
తయారీ విదానం: కమలా తొక్క లోపల తెల్లగా ఉండే తీగల్ని ముందుగా తీసేయాలి. ఇవి ఉంటే చేదు వస్తుంది. ఉల్లి, టొమాటో ముక్కలు తరగాలి. కమలా తొక్కల్ని సన్నటి ముక్కలుగా తరగాలి. వేడిచేసిన నూనెలో ఆవాలు వేసి అవి చిటపటమనేప్పుడు శెనగ పప్పు, మినపప్పు, జీలకర్ర వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఉల్లి ముక్కలు మెత్తబడగానే కమలా తొక్కల తరుగు, టొమాటొ తరుగు వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు వేయించాలి. పచ్చి వాసన పోయేవరకు స్టవ్ మీదే ఉంచాలి. అంతే కమలా తోక్క గ్రేవీ రెడీ. గ్రేవీ ఇష్టం లేనివారు అందులో గ్లాసు నీరును పోసి స్టవ్ మీద ఉడికించాలి. అప్పుడు కమలా తొక్క కూర రెడీ అవుతుంది. ఈ కూరని వేడివేడి అన్నం, ఇడ్లీ లేదా దోసెలతో తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







