ఒకప్పుడు కృష్ణా నగర్ లో తిప్పలు పడ్డ భాస్కర భట్ల..!
- November 06, 2016
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సినిమా పరిశ్రమలో పనిచేసే వారు, సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నం చేసేవారు అంతా ఎక్కువగా ఈ ప్రదేశంలో నివసిస్తారని ప్రశ్నిస్తే టక్కున వచ్చే సమాధానమే హైదరాబాద్ నగరంలోని కృష్ణా నగర్ కాలనీ అని. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు గొప్ప స్థానాల్లో కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు కృష్ణా నగర్ లో తిప్పలు పడ్డవారే. నేను కూడా అందులో ఒకడిని అంటూ తెలుగు పాటల రచయితే భాస్కర బాట్ల అన్నారు.
అయన మీడియా తో మాట్లాడుతూ కృష్ణా నగర్ కష్టాలు నా జీవితంలోనూ ఉన్నాయని, అదొక విచిత్రమైన జీవితమని ఆయన అన్నారు.
కృష్ణా నగర్ జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని, ఎన్ని కష్టాలు అనుభవించినా వెనక్కి మళ్ళకుండా సక్సెస్ అయ్యానని మనం ల;అక్ష్యాన్ని చేధించాకే అందానికి అర్థం తెలుస్తుందని, ఫెయిల్ అయ్యాక వచ్చే సక్సెస్ లోనే అసలైన కిక్ ఉంటుందని ఆయన తెలిపారు.
'మన ఊరి రామాయణం' చిత్రంలోని 'వచ్చిపోవే ఒక్కసారికి, ఉక్కపోత ఉత్సవానికి' అనే పాట రాసినప్పుడు ప్రకాష్ రాజు చాలా సంతోషపడ్డారని ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ గురువు గారని, 'మన ఊరి రామాయణం' చిత్రంలో పాటలు రాయడానికి ఆయనకు వీలులేకనో, లేక అవకాశం చిక్కకపోవడం వల్లనో ఈ చిత్రంలో పాటలు ఆయన రాయలేదని, ఆయన వదిలేసిన అవకాశమే తనకు లభించిందని అన్నారు. అంతేతప్పా, సీతారామశాస్త్రి స్థానాన్ని తాను రిప్లేస్ చేశానని అనుకోవడం కరెక్టు కాదన్నారు. ప్రకాష్ రాజ్ త్వరలో ఒక కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారని, ఆ చిత్రంలో కూడా తాను పాటలు రాసే అవకాశముందని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







