త్రివిక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు.....
- November 07, 2016
ఆ పెన్ను పంచు డైలాగులు పేల్చడం మొదలెట్టింది..
షాన్తాడంతా డైలాగ్స్ ని షార్ట్ చేసింది
గుండెల్లో పాతుకుపోయిన పదునైన సంభాషణలు అందించింది
పంచులు పేల్చే పాత్రలని సృష్టించింది
ఇప్పుడీ పంచ్ డైలాగ్స్ ని పేపర్ బాయ్ నుంచి ప్రొఫెసర్ దాక ఫాలో అయిపోతున్నారు.. !
ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అతడే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయిత అవుదామనుకొన్న ప్రతోడు.. త్రివిక్రమ్ లా పంచ్ డైలాగ్స్ రాయాల్రా. దర్శకుడు అవుదామనుకొన్న ప్రతోడు త్రివిక్రమ్ లాగా సినిమాలు తీయాల్రా..పైకి రావాలని పట్టుదలతో ఉన్న ప్రతోడు.. త్రివిక్రమ్ లా ఎదగాలని కోరుకుంటున్నాడు. మరీ.. ఇంత ఎదిగినా త్రివిక్రమ్ ఈజీగానే ఈ స్టేజ్ కి చేరుకొన్నాడా.. ? లేదు.. ?? ఎన్నో ఉలి దెబ్బలు తిన్నాడు. ఓ శిల్పంగా మారాడు. ఇప్పుడందరిని మాయ చేసే మాటల మాంత్రికుడిగా మారాడు. ఆయన సినిమాలు బామ్మలకీ ఎక్కుతాయి..భామలకి కూడా నచ్చుతాయి. ద టీజ్ త్రివిక్రమ్.త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. భీమవరం కుర్రోడు. ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్(గోల్డ్ మెడలిస్ట్). ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత పోసాని కృష్ణ మురళీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. రచయితగా త్రివిక్రమ్ తొలి సినిమా స్వయంవరం (1999). నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో .. సినిమాలకి రచయితగా కొత్త ట్రెండ్ ని సృష్టించారు. 2002లో 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారారు. రచయితగా ఎంత పేరు తెచ్చుకొన్నాడో.. దర్శకుడిగా కూడా అంతే పేరు తెచ్చుకొన్నాడు త్రివిక్రమ్. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ, ఓవర్సీస్.. అనే తేడా లేనే లేదు. అందరికీ త్రివిక్రమ్ సినిమా నచ్చుతోంది. స్టార్ హీరోలందరికీ త్రివిక్రమ్ కావాలి.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు తీశాడు త్రివిక్రమ్. జల్సా, అత్తారింటికి దారేది. ఈ రెండు సూపర్ హిట్టే. ఇప్పుడీ కలయికలో మరో చిత్రం రానుంది. ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా పవన్ పొలిటికల్ కేరీర్ కి హెల్ప్ అయ్యే విధంగా తీర్చిదిద్దనున్నాడట త్రివిక్రమ్. ఇదే నిజమైతే.. పవన్ సినిమాలో పొలిటికల్ మురికిని కడిగేసే పంచ్ డైలాగ్స్ త్రివిక్రమ్ కలం నుండి జాలువారడం ఖాయం. పవన్ తో త్రివిక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని.. ఇకపై మరెన్నో హిట్ చిత్రాలని త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకి అందివ్వాలని కోరుకుంటూ.. మాటల మాంత్రికుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







