'సైతాన్'. ఈ నెల 17వ తేదీన విడుదల..
- November 07, 2016
సాధారణంగా 13, 666 నెంబర్లు చూస్తే కొందరికి అమానుష్య శక్తుల గురించి ఆలోచన వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వరుసలో 17 కూడా చేరుతుందని చెబుతోంది 'సైతాన్' చిత్ర యూనిట్. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సైతాన్'. ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఐదు నిమిషాల సన్నివేశాలను కూడా ప్రదర్శించారు. ఈ సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరికీ.. 'ఎవరు ఆ జయలక్ష్మి?' అనే ప్రశ్న తలెత్తుతోంది.ఆ ప్రశ్నకు 17న సమాధానం లభిస్తుందని చెబుతున్నారు ఆరా సినిమాస్ అధినేత మహేష్ గోవిందరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరపై, నిజ జీవితంలోనూ విజయ్ ఆంటోని ఓ అద్భుతమైన వ్యక్తి అని, ప్రతి ఒక్కరికీ సహకరించే మనస్తత్వం ఆయకుందన్నారు. ఆయన మనసుకు తగ్గట్టుగానే సినిమాలు కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాయన్నారు.తమిళంలో మాదిరిగా తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి అభిమానులు ఉన్నారు. భిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందించాం. విజయ్ ఆంటోని విజయ పరంపరలో ఈ సినిమా కూడా చోటు దక్కించుకుంటుందన్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనినే సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







