గూగుల్ లో ట్రంప్ దే పై చెయ్యి
- November 08, 2016
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నే ఎక్కువ మంది సెర్చింజన్ గూగుల్‌లో వెతికారు. ఫ్లోరిడా, మిచిగాన్ సహా 38 రాష్ట్రాల్లో ట్రంప్ కోసం ఎక్కువగా వెతికారు. ఓ వైపు అధ్యక్ష ఎన్నికలు సాగుతున్నాయి.
సర్వేల్లో హిల్లరీ ముందంజలో ఉన్నారు. కానీ జనాలు వెతికిన వారిలో మాత్రం హిల్లరీని ట్రంప్ బీట్ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
ఎక్కువ మంది ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడిన వలసదారులు, గర్భస్రావం, జాతి, ఐసిస్, ఆర్థిక వ్యవస్థ గురించి నెటిజన్లు తెలుసుకున్న వాటిలో టాప్ ఐదు జాబితాలో ఉన్నట్లు సోషల్ మీడియా నిపుణుడు జాసన్ మోలికా వెల్లడించారు.
2012 ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ప్రజలు 'ఎలా ఓటు వేయాలి' అని సెర్చ్ చేశారు. ఈ ఏడాది ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఎక్కడ ఓటు వేయాలి' అనే దానిని వెతికారు.
అమెరికా ఎన్నికలు సందర్భంగా గూగుల్ 'ఓట్' అని ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఓట్ అనే డూడుల్ వివిధ భాషల్లో కనిపిస్తుంది. నెటిజన్లు డూడుల్‌పై క్లిక్ చేస్తే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడంతో పాటు, దగ్గర్లో ఉన్న పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







