బరువు తగ్గాలంటే...?
- November 08, 2016
బరువు తగ్గాలంటే.. ? ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవించాలి. చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరుసార్లు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోండి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చౌతాయి. వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకోవాలి.
ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోండి. ఆకలి లేనప్పుడు అస్సలు ఆహారం తీసుకోవద్దు. ప్యాకేజ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. లిఫ్ట్‌లో పై ఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లైతే లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి. పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది.
ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాలపాటు నడవండి. దీంతో మీ శరీరం తెలికగా మారుతుంది. ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడొద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







