నోట్ల మార్పిడిపై సినీ ప్రముఖుల ప్రశంసలు ...
- November 08, 2016
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నల్లధనం, దొంగనోట్లతో అక్రమాలకు పాల్పడేవారి ఆట కట్టించడానికి మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ సంచలన నిర్ణయంపై ఎవరేమన్నారంటే..
'ఇది నిజంగా గొప్ప నిర్ణయం. మోదీ దుమ్ము దులిపేశారు'- కరణ్ జోహార్ .
'హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ గారు.
కొత్త భారతదేశం పుట్టింది. జైహింద్'-రజనీకాంత్
'మీ థండర్‌ను మేము దొంగిలించాం అమెరికా. మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక్క దెబ్బతో నల్లధనాన్ని నిర్మూలిస్తున్నారు'- అదితిరావ్ హైదరి.
'అమెరికాలో ఓట్ల కౌంటింగ్. భారత్‌లో నోట్ల కౌంటింగ్'- సొనాక్షి సిన్హా
'ఓ చక్కటి దేశాన్ని తయారుచేయడానికి మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారు. మనమంతా ఒక్కటై నల్లధనాన్ని అరికట్టడంలో ప్రభుత్వానికి సాయం చేయాలి'- అనుష్క శర్మ
'అవినీతిని నిర్మూలించడానికి మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం'-ఇమ్రాన్ హష్మి
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







