'ఒక్కడొచ్చాడు' పాటలు విడుదల..
- November 08, 2016
విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు' పాటలు విడుదలయ్యాయి. ఎం. పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. తమిళ చిత్రం 'కత్తిసండై'కు ఇది తెలుగు రూపం. హిప్ హాప్ తమిళ స్వరాలు కూర్చారు. సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నాం. లవ్, యాక్షన్, కామెడీ సహా అన్ని అంశాలూ చక్కగా కుదిరాయి. తమన్నాతో మొదటిసారి కలిసి చేశాను. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఓ విషయం చెబుతున్నా.అదేంటనేది సినిమా చూసే తెలుసుకోవాలి. నటుడిగా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నా కాబట్టి అభిమానులు నాకివ్వాలనుకుంటున్న యాక్షన లెజెండ్‌లాంటి బిరుదులేమీ వద్దు. నేను విశాల్‌గానే ఉండాలనుకుంటున్నా. నా వల్ల వీలైనంతగా సొసైటీకి సపోర్ట్ చేస్తున్నా'' అని చెప్పారు.విశాల్ మంచి నటుడనీ, ఫైట్లు, డాన్సులు చక్కగా చేస్తాడనీ తమన్నా అన్నారు. ''ఆయన మంచి మనసున్న మనిషి. వ్యక్తిగా నాకు చాలా ఇనస్పిరేషన'' అని ఆమె తెలిపారు. తాను నిర్మించిన 'బొమ్మరిల్లు'ను ఈ చిత్ర నిర్మాత హరి చెన్నైలో విడుదల చేశారని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.'పందెంకోడి' సినిమాతో తనేమిటో నిరూపించుకున్న విశాల్ పన్నెండేళ్లుగా నిజాయితీతో కష్టపడుతూ మంచి విజయాల్ని సాధించాడన్నారు. దర్శకుడు సురాజ్ మాట్లాడుతూ ''ఇది మంచి వినోదంతో కూడుకున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్. చక్కని సందేశం కూడా ఉంటుంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తారలు శ్రీదివ్య, మెహరీన, నిర్మాతలు సి.కల్యాణ్, టి. ప్రసన్నకుమార్, బెల్లంకొండ సురేశ్, మాటల రచయిత రాజేశ్ ఎ. మూర్తి, గేయ రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







