విలన్ల తో 'చిరు' పోరాడే సన్నివేశాలు..
- November 09, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' కోసం అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరంజీవి' వెండితెరపై ఎలా కనబడుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ల తో 'చిరు' పోరాడే సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫొటో 'చిరు' పక్కన కండలు పెంచిన ఓ వ్యక్తి కనబడుతుండడం..ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







