45వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్...
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ సాధించారు. 70 ఏళ్ల వయసులో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడం కూడా US చరిత్రలో ఓ రికార్డే. 50 రాష్ట్రాలు, రాజధాని వాషింగ్టన్ ఇలా అన్నిచోట్లా ట్రంప్, హిల్లరీ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఫ్లోరిడా, ఒహాయో, నార్త్ కరోలినా వంటి కీలకమైన రాష్ట్రాలన్నీ ట్రంప్ ఖాతాలో పడ్డాయి. ఐతే, అదే టైమ్‌లో వర్జీనియా, కాలిఫోర్నియా వంటి చోట్ల హిల్లరీ స్పష్టమైన ఆధిపత్యం కనపరిచారు. అత్యధిక 55 ఎలక్టోలర్ ఓట్లు ఉన్న కాలిఫోర్నియా హిల్లరీ ఖాతాలోనే పడినా అది ఆమెను గెలిపించలేకపోయింది. మొత్తం 538 ఓట్లకు గాను.. ట్రంప్ 270కి పైగా ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించి వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. మొదట్నుంచి సర్వేలన్నీ హిల్లరీకే మొగ్గుచూపాయి. ఒక శాతం ఓట్ల తేడాతో ఆమె గెలుస్తారని అంచనా వేశాయి. ఐతే, ఆ ఒక్క శాతం రివర్స్ అయ్యి ట్రంప్‌ను గెలిపించింది. 8 ఏళ్ల ఒబామా సర్కార్‌పై సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ట్రంప్‌కి కలిసొచ్చింది. ట్రంప్ వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు కలిసి వచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. పన్నుల తగ్గించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, వలసల్ని నిరోధించడం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం వంటి హామీలను ట్రంప్ విస్తృతంగా ప్రచారం చేశారు. "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్.. వెల్దీ ఎగైన్" నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. ఇదంతా ఆయనకు కలిసొచ్చిందనే చెప్పాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







